జవహర్ నవోదయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

On: December 12, 2025 7:12 PM

జవహర్ నవోదయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

జవహర్ నవోదయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

వెంకటాపురం నూగూరు డిసెంబర్ 12 తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం (13వ తేదీ) జరగనున్న జవహర్ నవోదయ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని పరీక్షల నిర్వహణ అధికారులు తెలిపారు. వెంకటాపురం, వాజేడు మండలాల నుంచి విద్యార్థులు ఈ కేంద్రంలో పరీక్ష రాయనున్నారు. ఇంగ్లీషు మీడియం 61 మంది, తెలుగు మీడియం 46 మంది, మొత్తం 107 మంది విద్యార్థులు హాజరవతున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 10.45 గంటలనుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనుంది. విద్యార్థుల సౌకర్యార్థం బెంచీలు, తాగునీటి సదుపాయం, వైద్య సౌకర్యం, పోలీసు బందోబస్తు వంటి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్‌గా బొల్లె శ్రీనివాస్, బిఎల్ఓగా జివివి సత్యనారాయణ, సిఎల్ఓగా పరంధామయ్య విధులు నిర్వహించనున్నారు. ఖమ్మం నుండి అధికారుల పర్యవేక్షణ కూడా ఉంటుందని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని అధికారులు సూచించారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!