కేజీబీవీ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం

On: March 31, 2026 5:45 PM

కేజీబీవీ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం

కేజీబీవీ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం

టీగ్రాజేసీ సెట్ ద్వారా అడ్మిషన్లు 

విద్యార్థినులు వినియోగించుకోవాలి

ములుగు, మార్చి 31, తెలంగాణ జ్యోతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం టీగ్రాజేసీ సెట్ (TGRJC CET) ద్వారా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. సిద్ధార్థ రెడ్డి తెలిపారు. 2026 ఏప్రిల్‌లో పదవ తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థినులు ఈ ప్రవేశ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థి నులు https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/ వెబ్‌సైట్ ద్వారా మార్చి 16 నుండి ఏప్రిల్ 15, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కోర్సులు, సీట్ల వివరాలకు సమగ్ర శిక్ష జెండర్ అండ్ ఈక్విటీ కోఆర్డినేటర్ బుర్ర రజితను 9666294715 నంబర్‌లో సంప్రదించవచ్చ న్నారు. కేజీబీవీ విద్యాలయాల్లో నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షల శిక్షణ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. జవహర్ నగర్‌లో నీట్, చల్వాయి లో ఐఐటి-జేఈఈ, తాడ్వాయిలో క్లాట్ కోచింగ్‌తో పాటు సాధారణ మరియు వృత్తి విద్యా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త భవనాలు, సదుపాయాలతో విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!