సాంకేతిక సమస్యతో స్తంభించిన ఏపీజీవీబీ బ్యాంకు సేవలు
– ఇబ్బందులకు గురైన బ్యాంకు ఖాతాదారులు
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో కలిగిన సాంకేతిక సమస్యతో బ్యాంకు కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ఏ.పీ.జీ.వీ.బీ. బ్రాంచ్ లో సిగ్నల్స్ లేకపోవటం వల్ల ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం వరకు వందలాది మంది ఖాతాదారులు బ్యాంకు వద్ద పడిగాపులు పడ్డారు. వేలాది మంది ఖాతాదారులు ఉన్న బ్రాంచీలో, బ్యాంకు పనివేళల్లో 35 కిలోమీటర్ల దూరం ఎదిర ,ఏకన్నగూడెం ,ఆలుబాక ఇతర దూర ప్రాంతాల నుండీ వందలాది ఖాతాదారులు, రైతులు , గ్రూపు సంఘాల మహిళలు, రుణమాఫీ రైతులు, రెగ్యులర్ జమ, చెల్లింపు ఖాతాదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే,అన్ని గ్రామీణ బ్యాంకులు కు దేశవ్యాప్తంగా టెక్నికల్ ఇబ్బందులతో ఆన్లైన్ సిగ్నల్స్ నిలిపివేసినట్లు ఖాతాదారులు సహకరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో సోషల్ మీడియాలో ఒక ప్రకటన హల్చల్ చేస్తున్నది.