విద్యార్థులకు అపార్ ఐడిలను క్రియేట్ చేయాలి

విద్యార్థులకు అపార్ ఐడిలను క్రియేట్ చేయాలి

విద్యార్థులకు అపార్ ఐడిలను క్రియేట్ చేయాలి

తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం: కన్నాయిగూడెం మండలం లోని ఆశ్రమ పాఠశాలలో సోమవారం నిర్వహించిన సమావే శానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ శ్రీనివాస్ హాజరై  విద్యార్థులకు ‘అపార్’ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ)  నెంబర్ క్రియేట్ చేయాలని ఉపాద్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా ఎంఈఒ మాట్లాడుతూ మండలంలోని అన్ని పాఠశా లలో విద్యార్థులకు అపార్ ఐడి కేటాయించాలన్నారు. విద్యా ర్థుల విద్య పురోగతిని ట్రాక్ చేసేందుకు, అభ్యసనలో వారిని మరింత సమర్ధవంతంగా నిర్వహేంచేందుకు ప్రత్యేక గుర్తింపు సృష్టించి, ఎన్ఐఇపిలో పొందుపరిచే విధంగా చూడాలని అన్నా రు. విద్యార్థులు తమ అకడమిక్ రికార్డులను ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అపార్ ఐడి పై తల్లిదండ్రుల ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించి తల్లి దండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ ఐడి లో విద్యార్థి పేరు పుట్టిన తేదీ, ఆధార్ కార్డు వివరాలను సరిచూసు కోవాలని తెలిపారు. ఈ ఐడి రూపొందించిన తర్వాత తల్లి దండ్రులు సంరక్షణ ఫోన్ కు సందేశం వస్తుందన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలని తెలిపారు. ఈ ప్రక్రియ  సక్రమంగా జరిగేలా చూసుకోవాలని మండల విద్యాశాఖ అధికా రులను ఆదేశించారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment