అంగన్వాడీ కేంద్రాలు పిల్లలతో కళకళలాడాలి

అంగన్వాడీ కేంద్రాలు పిల్లలతో కళకళలాడాలి

అంగన్వాడీ కేంద్రాలు పిల్లలతో కళకళలాడాలి

– ఎలాంటి ఒత్తిడిలేని ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను చిన్నారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.

– అందులో భాగంగానే ఈ అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమం.

– మంత్రి దనసరి సీతక్క.

ములుగు ప్రతినిధి, జూన్ 11, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న అమ్మ మాట – అంగన్వాడీ బాట ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ములుగు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని వెంకటాపూర్ మండలంలోని నల్లగుంట గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రం లో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ అధికారి తుల రవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., తో కలసి జిల్లాలో అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సామాన్యుడికి విద్య అందని ద్రాక్షలా ఉండకూడదని, రాష్ట్రం లో 3 సం.లు నిండిన ప్రతీ బిడ్డ ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసించాలనే గొప్ప లక్ష్యం తో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, అందులో భాగంగానే ఈ రోజు ఈ “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. చదువంటే బరువులు మోసే యంత్రాల్లా పిల్లలను మార్చడం కాదని, బాధ్యత కల్గిన పౌరులుగా ఎదిగేలా వారిని తీర్చిదిద్దడమని అన్నారు. నేటి సమాజంలో చదువుల పేరు మీద పిల్లలపై ఎన్నో విధాలుగా ఒత్తిడి పెరుగుతుందని, దాని కారణంగా వారు ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

అంగన్వాడీ కేంద్రాలు పిల్లలతో కళకళలాడాలి

ఇలాంటి ఇబ్బందులకు దూరంగా పిల్లకు ఆహ్లాదకరం గా ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందించడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. తల్లి ఒడిలో నుండి అంగన్వాడీ బడి లోకి వస్తున్న పిల్లలందరికీ నాణ్యం విద్యను అందించడం కోసం అదే తల్లి ప్రేమతో వారికి సరైన విద్యా బుద్దులు నేర్పేలా అంగన్వాడీ టీచర్లకు ఇదివరకే ముందస్తు శిక్షణ ఇవ్వడం జరిగిందని, అంగన్వాడీ కేంద్రాలన్నీ ప్రీ స్కూల్స్ గా పని చేస్తాయని, ఈ ప్రీ స్కూల్స్ లలో పిల్లలకు ఎలాంటి మానసిక ఒత్తిడి లేని ఆట పాటలతో కూడిన విద్యాభ్యాసం, నాణ్యమైన పౌష్టికాహారం అందించడం జరుగుతుందని రాష్ట్రం లో మొదటిసారిగా అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ ని ఈ రోజు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తద్వారా పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా, బాధ్యతాయుతంగా ఎదుగుతారని ఆశా భావం వ్యక్తం చేశారు. అనంతరం అంగన్వాడీ టీచర్లతో మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ల సంక్షేమానికి మన ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే అంగన్వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని పెంచడం జరిగిందని అన్నారు. నాణ్యమైన సరుకులు పొందడం మన హక్కు, లబ్ధిదారులు తీసుకుంటున్న సరుకుల్లో ఏమైనా నాణ్యత లోపిస్తే వెంటనే వెనక్కు పంపించి నాణ్యమైన సరుకులను మాత్రమే పొందాలని, వాటినే లబ్ధిదారులకు అందించాలని సూచించారు. అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ తల్లితండ్రులు 3 నుండి 5 సం.లోపు వయస్సున్న తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రం లో చేర్పించి వారు పూర్వ ప్రాథమిక విద్యను పొందేలా చూడాలని జిల్లాలోని తల్లి తండ్రులకు పిలుపునిచ్చారు. అనంతరం నల్లగుంట అంగన్వాడీ కేంద్రం లో కొత్తగా ప్రీస్కూల్ (పూర్వ ప్రాథమిక విద్య) లో చేరిన చిన్నారులకు మంత్రి , జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం తో కలిసి అక్షరాభ్యాసం చేయించారు.  అదేవిధంగా 5 సం.లు వయస్సు నిండి ప్రాథమిక పాఠశాలకు ప్రమోట్ అయిన పిల్లలు ప్రత్యేక వస్త్రధారణలో రాగా వారికి మంత్రి సర్టిఫికెట్లు ప్రధానం చేసి “గ్రాడ్యుయేషన్ డే” నిర్వహించారు. అనంతరం జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా బాలల పరిరక్షణ విభాగము ములుగు ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ తో కలిసి ఆవిష్కరించారు. ములుగు జిల్లాను బాలకార్మికులు లేని జిల్లా గా తీర్చిదిద్దాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ జె డి ఝాన్సీ లక్ష్మీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, సి డి పి ఓ లు, శిరీష, ప్రేమలత, విజయ , జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డి సి పి ఓ) జె. ఓంకార్, జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని సూపర్వైజర్లు, డి డబ్ల్యుఓ కార్యాలయం, డిసిపియు, సిహెచ్ఎ ల్, సఖి & డిహెచ్ ఈ డబ్ల్యూ ల సిబ్బంది, ములుగు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ప్రీ స్కూల్ లో చేరిన పిల్లల తల్లితండ్రులు, గ్రామస్థులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రాలు పిల్లలతో కళకళలాడాలి

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment