విద్యుత్ షాక్‌తో ఆవు, దూడ మృతి

విద్యుత్ షాక్‌తో ఆవు, దూడ మృతి

విద్యుత్ షాక్‌తో ఆవు, దూడ మృతి

వెంకటాపూర్, జూన్ 15, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని బూరుగుపేట గ్రామ పంచాయతీ పరిధి అందుగుల మీదిలో రైతు భూనేని రమేష్‌కు చెందిన ఆవు దూడ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. రైతు రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి..  శనివారం సాయంత్రం సమయంలో ఆవు, దూడ తిమ్మాపూర్ పరిధిలో గల ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మేతకు వెళ్లగా షార్ట్ సర్క్యూట్‌ వల్ల విద్యుత్ ఘాతానికి లోనై ఆవు, దూడలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. వాటి విలువ సుమారు రూ.70 వేలు ఉంటుందని రైతు వివరించారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. బాధిత రైతు భూనేని రమేష్ ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక సాయం అందించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment