Amazon / Flipkart : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో
ఇక చెల్లదు..!
– రీప్లేస్‌మెంట్ కావాలనుకునే యూజర్లకు బిగ్‌షాక్..
డెస్క్ : ఆన్‌లైన్‌లో కావలసిన వస్తువులను ఇంట్లో కూర్చుని సులభంగా బుక్ చేసుకుంటున్నారు. ఈకామర్స్ వెబ్సైట్లు, యాప్ ల ద్వారా వినియోగదారులకు మరింత దగ్గరవు తున్నారు. వివిధ రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు అందించడంతో ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ సైట్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్ / ఫ్లిప్‌కార్ట్ నుండి వస్తువులను కొనుగోలు చేస్తున్నారా ఇది తప్పక చదవాల్సిందే… అమెజాన్, ఫ్లిప్ కార్ట్ రెండు సంస్థలు తీసుకున్న వస్తువుల రీప్లేస్‌మెంట్ పాలసీలో పెద్ద మార్పును చేశాయి. మీరు కొనుగోలు చేసిన వస్తువు పాడైతే, మీరు దానిని వెంటనే మార్చలేరు. ఇకముందు వస్తువులను కొని రీప్లేస్‌మెంట్ చేసి మరో వస్తువు పొందడం ప్రాసెస్ తో కూడుకుంది… గతంలో ఈ రెండు కంపెనీలు 7 రోజుల్లో వస్తువులను మార్పిడి చేసేవి. ఇప్పుడు ఆ పథకాన్ని నిలిపివేసాయి. మీరు ఒక వస్తువును మార్చాలనుకుంటే మీరు సంబంధిత సర్వీస్ సెంటర్ ను సందర్శించిన తర్వాత దానికి సంబంధించిన స్థితిగతులను పరిశీలించి ఆ తర్వాత కొత్త ప్రోడక్ట్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. అప్పుడు వినియోగదారుల సేవా కేంద్రం సూచన మేరకు వస్తువును తిరిగి పొందుతారు. గతంలో కొన్న వస్తువు ప్రాబ్లం ఉన్నట్లయితే ఫ్లిప్ కార్ట్/ అమెజాన్ లో రీప్లేస్మెంట్ ఆప్షన్ కోరితే వారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని వస్తువులు రిప్లేస్ / మనీ రిఫండ్ చేసేవారు. ఇకముందు ఆ పరిస్థితి ఉండక పోవడంతో వినియోగదారులకు ఇక్కట్లు తప్పవు.