ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయిస్ యూనియన్ కాలేశ్వరం జోన్ ఇన్చార్జిగా గాదే రమేష్
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : తెలంగాణ స్టేట్ ఎయి డ్స్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కాలేశ్వరం జోనల్ ఇన్చార్జిగా గాదె రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ సమన్వయంతో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గా టీ.శివ ప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షు లుగా ఏ. రంజిత్ కుమార్, ప్రధాన కార్యదర్శి గా సీ శ్రీదేవి రెడ్డి, కోశాధికారిగా రవి ఎన్నికయ్యారు. కాలేశ్వరం జోనల్ పరిధిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, పెద్దపెల్లి జిల్లా, ములుగు జిల్లా లు ఉన్నాయి. జిల్లాల పరిధిలో యూనియన్ కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహించుటకు జోనల్ ఇన్చార్జిలను నియమిం చారు. 2005 నుంచి జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సమీకృత సలహా పరీక్ష కేంద్రం (ఐ సి టి సి) లో కౌన్సిలర్ గా గాదె రమేష్ ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. కాలేశ్వరం జోన ల్ ఇన్చార్జిగా నియమితులైన సందర్భంగా గాదె రమేష్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకంతో తాను యూనియన్ పటిష్టతకు, సభ్యుల సంక్షేమానికై పాటుపడతానని అన్నారు.