వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వలన ఆదివాసి మహిళకు ప్రాణాపాయం
– ఆదివాసి సంఘాల ఐక్యవేదిక ఫిర్యాదు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి: ప్రభుత్వ వైద్య శాలలో సిబ్బంది, డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా కాన్పు కోసం వచ్చిన ఆదివాసి మహిళ ప్రాణాపాయ స్థితిలోకి చేరుకుం దని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంఘాల ఐక్యవేదిక మంగళవారం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సెఫ్టెంబర్ 24 వ తేది న వెంకటాపురం ప్రభుత్వ వైద్య శాల నందు చింత భువనే శ్వరి ని నార్మల్ డెలివరీ చేశారు. తరువాత ఆమెకు సీరియస్ గా ఉందని ఏటూరునాగారం, అక్కడి నుండి ములుగుకు, అక్కడ నుండి ఎంజీఎం వరంగల్ కు రిఫర్ చేశారు. అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం సి. కె. ఎం మెటనరీ హాస్పటల్ కు రిఫర్ చేశారు. వైద్యులు పరీక్షించి ఆమెకు గర్భసంచి రెండు చోట్ల పగిలింది, మూత్రనాలం దెబ్బతిన్నది, పొత్తి కడుపు కింది భాగం దెబ్బతిన్నదని, వెన్నుపూస డిస్క్ భాగం కొంత ఇబ్బం దులున్నాయని చెప్పి, గర్భసంచికి ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పుడు ఆమె పరిస్థితి సీరియస్ గా, ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇది కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆదివాసి మహిళకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడిందని, డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకుండా ఆమెకు వైద్య సిబ్బంది డెలవరి చేయడం వల్లనే, ఈ విధంగా ఆమె యొక్క బాడీ పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయని ఆరోపించారు. అందుకు కారకులైన డ్యూటీ డాక్టర్ మరియు వైద్య సిబ్బంది, నర్సులను విచారించి వారిపై శాఖ పరమైనటు వంటి చర్యలు తీసుకొని బాధితురాలు చింత భువనేశ్వరికి మెరుగైన వైద్యం అందించి ఆమెకు న్యాయం చేయాలని ఐక్యవేదిక నాయ కులు పూణేం రామచందర్రావు, పరిషిక సతీష్, చింత సోమ రాజు, తాటి లక్ష్మణ్ పూనెం మునేశ్వరరావు ,జిల్లా ఉన్నతా ధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావును కలిసి బాధితురాలికి న్యా యం చేయాలని వినతి పత్రం అందజేశారు. బాధ్యులపై చర్యలు తీసుకొని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని ఆదివాసీ సంఘాల నాయకులు హెచ్చరించారు.