మేడారం పోలీస్ స్టేషన్‌ నూతన ఎస్ఐగా అచ్చ కమలాకర్

On: December 30, 2025 11:26 AM

మేడారం పోలీస్ స్టేషన్‌ నూతన ఎస్ఐగా అచ్చ కమలాకర్

మేడారం పోలీస్ స్టేషన్‌ నూతన ఎస్ఐగా అచ్చ కమలాకర్

ములుగు ప్రతినిధి, డిసెంబర్ 30, తెలంగాణ జ్యోతి :  తాడ్వాయి మండలం పరిధిలోని మేడారం పోలీస్ స్టేషన్కు నూతన ఎస్ఐగా అచ్చ కమలాకర్ను నియమించారు. గతంలో గోవిందరావుపేట మండలంలోని పస్రా పోలీస్ స్టేషన్లో రెండు సంవత్సరాల పాటు ఎస్ఐగా విధులు నిర్వర్తించిన కమలాకర్, తన సేవలతో మంచి పేరు సంపాదించుకున్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, చట్టంపై పట్టు, ప్రజలతో సమన్వయం వంటి అంశాల్లో కమలాకర్ ప్రత్యేక గుర్తింపు పొందారని సహచరులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల సమస్యలకు తక్షణ స్పందన వంటి అంశాల్లో ఆయన సమర్థంగా పనిచేశారని సమాచారం. మేడారం పోలీస్ స్టేషన్ పరిధి, జాతర కాలంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు అవసరమైన ప్రాంతం కావడంతో, అనుభవం ఉన్న అధికారిని నియమించినట్టు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!