Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

పోక్సో కేసులో నిందితునికి 20ఏళ్ల జైలు శిక్ష

On: December 12, 2025 8:44 PM

పోక్సో కేసులో నిందితునికి 20ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితునికి 20ఏళ్ల జైలు శిక్ష

– తీర్పు వెలువరించిన జిల్లా జడ్జి సూర్యచంద్రకళ

ములుగు, డిసెంబర్12, తెలంగాణజ్యోతి : పోక్సో కేసులో నిందితునికి 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ములుగు జిల్లా జడ్జి ఎస్.వీ.పీ.సూర్యచంద్రకళ తీర్పు వెలువరించారు. శుక్రవారం ములుగు జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం (ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్ట్) లో విచారణ జరుగగా తీర్పు వెలువడటంతో అందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ వెల్లడించారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి గ్రామానికి చెందిన నిందితుడు ఏల్పుల రవితేజ ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను వేదింపులకు గురిచేయడంతో బాధితురాలి తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. 2020లో 363, 376(3), పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇన్ని రోజులు కోర్టులో విచారణ జరిపిన జడ్జి శుక్రవారం తుదితీర్పు వెలువరించారు. నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.6వేల జరిమానా విధిస్తూ జడ్జి సూర్యచంద్రకళ తీర్పునిచ్చారు. కాగా, కేసు దర్యాప్తు అధికారులు డీఎస్పీ కిషోర్, సీఐ దేవేందర్రెడ్డి, ఎస్సైలు ఫణి, లక్ష్మణ్, సీడీవో స్రవంతి లను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అభినందించారు. మైనర్లపై నేరాలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!