అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి 

On: December 27, 2025 4:35 PM

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి 

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి 

– జీఓ 52ను వెంటనే సవరించాలి

– టీఎస్‌జేయూ, టీయూడబ్ల్యూజే హెచ్143 డిమాండ్

ములుగు, డిసెంబర్ 27, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 252లోని లోపాలను వెంటనే సవరించి, అర్హులైన జర్నలి స్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (TSJU), టీయూడబ్ల్యూజే హెచ్–143 యూనియ న్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలో యూనియన్ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట టీయూడబ్ల్యూజే హెచ్ 143నాయకులు ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేయగా టీఎస్జేయూ నాయకులు జిల్లా అడిషనల్ కలెక్టర్ సిహెచ్.మహేందర్‌ జీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గతంలో అమలులో ఉన్న జీఓ 239 స్ఫూర్తితో కొత్త జీఓ 252ను సవరించాలని, లేనిపక్షంలో జర్నలిస్టుల హక్కులకు ఇది గొడ్డలి పెట్టుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత జీఓ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, చిన్న పత్రికలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టుల ఉపాధి, గౌరవం, భద్రతలకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు అక్రిడేషన్ కలిగిన సుమారు 10వేల మంది జర్నలిస్టులు తమ అక్రిడేషన్లను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. గతంలో బిగ్ కేటగిరీ పత్రికలకు 20మంది కరస్పాండెంట్లు, 20మంది డెస్క్ జర్నలిస్టులు, 4గురు కెమె రామెన్లకు అక్రిడేషన్లు మంజూరు చేయగా, ప్రస్తుతం వాటిని 12 కరస్పాండెంట్లు, 12 డెస్క్ జర్నలిస్టులు, 3 కెమెరామెన్లకు తగ్గించడం అన్యాయమని అన్నారు. ఇదే విధంగా జిల్లా స్థాయిలో కూడా కోత విధించడం సరైంది కాదన్నారు. గతంలో కేబుల్ ఛానళ్లకు రాష్ట్ర స్థాయిలో 12అక్రిడేషన్లు ఉండగా, ప్రస్తుతం వాటిని పూర్తిగా సున్నాకు పరిమితం చేయడం దారుణమని అన్నారు. నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లకు గతంలో ఇచ్చిన అక్రిడేషన్లను కొత్త జీఓలో పూర్తిగా తొలగించడం సరికాదని విమర్శించారు. డెస్క్ జర్నలిస్టులను వేరు చేస్తూ మీడియా కార్డు పేరిట విభజన తీసుకురావడం జర్నలిస్టు సమాజంలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోందని, ప్రభుత్వ ప్రతిష్ఠకు కూడా భంగం కలిగించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ సీనియర్ నాయకుడు, ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొట్టె రాజిరెడ్డి, నాయకులు దూడబోయిన రాకేష్, చుంచు రవి, గాదం దేవేందర్, మోడెం సారంగపాణి, బోయిన పల్లి శ్రీధర్, మాట్ల సంపత్, పోలోజు రామ్మూర్తి, వేముల సతీష్, ఆవుల వెంకన్న, కోరి అరవింద్, గొల్ల నరేందర్, రాజు, కంది జీవన్ రెడ్డి, సల్లూరి మహేందర్, సుంకరి సంపత్, పత్తి కోటేశ్వర్, టీఎస్ జెయు ములుగు జిల్లా అధ్యక్షుడు చల్లగురుగుల రాజువర్ధన్, ఉపాధ్య క్షుడు నాగపురి హరినాథ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కంచర్ల రాజు, కమిటీ సభ్యులు పెండెం బిక్షపతి, కోటి లింగాచారి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి 

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!