Acb | ఏసీబీకి చిక్కిన పరిశ్రమల శాఖ మేనేజర్ శ్రీనివాస్

Acb | ఏసీబీకి చిక్కిన పరిశ్రమల శాఖ మేనేజర్ శ్రీనివాస్
భూపాలపల్లి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం జరిగిన ఏసీబీ అధికారుల దాడులలో జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్ వద్ద ఇండస్ట్రియల్ మేనేజర్ గంగాధర శ్రీనివాస్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా రూ. 53 లక్షలకు ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన గుగులోతు లచ్చీరాం గత సంవత్సరం అశోక్ లేలాండ్ వాహనాన్ని తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన సబ్సిడీ కోసం లచ్చీరాం కొద్ది రోజుల క్రితం జిల్లా పరిశ్రమల శాఖలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాస్ లచ్చీరాం నుంచి మొదట రూ. 50 వేలు తీసుకున్నాడు. అనంతరం మళ్లీ రూ. 60 వేలు కావాలని డిమాండ్ చేయడంతో లచ్చీరాం ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో గురువారం లచ్చీరాం రూ. 15వేలు ఇస్తుండగా జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాస్‌ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

ఏసీబీకి చిక్కిన పరిశ్రమల శాఖ మేనేజర్ శ్రీనివాస్

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment