Aadhaar PVC Card : ఆధార్ పి వి సి కార్డ్.. సింపుల్గా మీ మొబైల్ లో ఆర్డర్ చేయండిలా…

Written by telangana jyothi

Published on:

Aadhaar PVC Card : ఆధార్ పి వి సి కార్డ్.. సింపుల్గా మీ మొబైల్ లో ఆర్డర్ చేయండిలా…

డెస్క్ : గతంలో ఇచ్చిన ఆధార్ కార్డ్ సైజ్ పెద్దగా ఉండటం వల్ల జేబులో, పర్సులో పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకే UIDAI ఆధార్ పీవీసీ కార్డ్ (Aadhaar PVC Card) తీసుకొచ్చింది.

పివిసి కార్డ్ ఎలా ఆర్డర్ చేయాలో తెలుసు కుందాం..

ఆధార్ కార్డ్ ప్రతి అవసరానికి ఇప్పుడు ముఖ్య డాక్యుమెంట్గా మారింది. అందుకే ఆధార్ కార్డును ఎప్పుడు మనతో అంటి పెట్టుకోవాల్సి వస్తుంది . ఆధార్ కార్డ్ కలర్ జిరాక్స్ తీసి, పివిసి కార్డులా ల్యామినేషన్ చేయిస్తే ఆ కార్డు ఎక్కడా చెల్లదు. అదే యు ఐ డి ఏ ఐ నుండి వచ్చే ఆధార్ పీవీసీ కార్డ్ ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డులా పనిచేస్తుంది. ఒరిజినల్ ఆధార్ కార్డుపై ఉన్నట్టే ఆధార్ పీవీసీ కార్డుపైనా క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, ఘోస్ట్ ఇమేజ్, ఇష్యూ డేట్, ప్రింట్ డేట్, ఎంబార్డ్ ఆధార్ లోగో లాంటివి ఉంటాయి. రూ.50 నామినల్ ఛార్జీ చెల్లిస్తే చాలు, పీవీసీ ఆధార్ కార్డ్ ఇంటి అడ్రస్ కు వచ్చేస్తుంది.

  ముందుగా

https://uidai.gov.in

లేదా

https://resident.uidai.gov.in

సైట్లోకి వెళ్లి అక్కడ Order Aadhaar PVC Card పైన క్లిక్ చేయాలి. 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లేదా 28 అంకెల ఎన్రోల్మెంట్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ సబ్మిట్ చేసి ఆధార్ వివరాలు చెక్ చేసుకోవాలి. పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేసి పీవీసీ కార్డ్ ఆర్డర్ చేయాలి.

నాన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఇలా అప్లై చేయాలి.

నాన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ చేయడానికి                ముందుగా

https://uidai.gov.in

https://resident.uidai.gov.in

సైట్ లోకి వెళ్లి Order Aadhaar PVC Card పైన క్లిక్ చేయాలి. 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లేదా 28 అంకెల ఎన్రోల్మెంట్ ఐడీ ఎంటర్ చేసి, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. If you do not have a registered mobile number బాక్స్ టిక్ చేయాలి. ప్రత్యామ్నాయ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ సబ్మిట్ చేసి ఆధార్ వివరాలు చెక్ చేసుకోవాలి. పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేసి పీవీసీ కార్డ్ ఆర్డర్ చేయాలి. ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ చేసిన తర్వాత SRN జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ తో మీ ఆర్డర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసిన వారం రోజుల్లో ఆధార్ పీవీసీ కార్డ్ మీ ఇంటి అడ్రస్ కు వస్తుంది. 

Tj news

1 thought on “Aadhaar PVC Card : ఆధార్ పి వి సి కార్డ్.. సింపుల్గా మీ మొబైల్ లో ఆర్డర్ చేయండిలా…”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now