జాతీయ స్థాయిలో 370 ర్యాంక్ సాధించిన కాళేశ్వరం విద్యార్థి.
– జీ-మెయిన్స్ ఫలితాల్లో గ్రావిటీ కళాశాల ప్రభంజనం. – ఫలితాల్లో చరిత్ర సృష్టించిన విద్యార్థులను సన్మానించిన యాజమాన్యం.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : ఎన్ టి ఏ విడుదల చేసిన జీ -మెయిన్స్ ఫలితాల్లో గ్రావిటీ జూనియర్ కళాశాల (హన్మకొండ) విద్యార్థయిన కాళేశ్వరం గ్రామానికి చెందిన గాడిపెల్లి అంజయ్య, మొండయ్య అనే విద్యార్థి ఆలిండియా స్థాయిలో 370 ర్యాంక్ సాధించారు. గ్రావిటీ కళాశాల చైర్మన్ దబ్బేట మహేష్ ఒక ప్రకటనలో తెలియ జేయడం జరిగింది. ఈ విద్యార్థి మహాదేవపూర్ గ్రీన్ వుడ్ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేయగా, తమ స్కూల్లో చదివిన విద్యార్థికి జాతీయ స్థాయి ర్యాంకు రావడం తో గ్రీన్ వుడ్ పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్, హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.