ల్యాండ్ మార్క్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
హనుమకొండ, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని కాకతీయ గురుకులంలో 2001- 2002 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం హనుమకొండ లోని ల్యాండ్ మార్క్ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి అప్పటి ఉపాధ్యాయులు విద్యార్థులందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు తమ తమ గత స్మృతులను నెమరు వేసుకున్నారు విద్యార్థు లతో ఉపాధ్యాయులకు ఉన్న జ్ఞాపకాలను మరియు విద్యార్థు లకు ఉపాధ్యాయులతో ఉన్న జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకోవడం జరిగింది 22 సంవత్సరాల తర్వాత విద్యా ర్థులంతా ఒకచోట కలుసుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు తిరుపతి రెడ్డి అశోక్ మధు కుమార్ రాజమౌళి భేతి సతీష్ తోట విష్ణు మాదాసు యుగేందర్ కొమ్మిరెడ్డి నరేందర్ రెడ్డి డెంగు రాజు కళ్యాణి స్రవంతి రాణి స్వప్న తదితరులు పాల్గొన్నారు.