Tata madhu | భద్రాచలం నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడాలి
గులాబీ సైన్యం అలుపెరగని పోరాటం చేయాలి : తాతా మధుసూదన్.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవ పర్యాయం నూతన ముఖ్యమంత్రిగా పదవి స్వీకరణ చేస్తారని భద్రాచలం బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. ప్రభుత్వ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రతి కుటుంబానికి అందాయని, ప్రతి కార్యకర్త గులాబీ సైన్యం గా పనిచేసి భద్రాచలం నియోజకవర్గం లో బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు ను గెలిపించుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు, టిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు, మండల పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు , పలువురు నేతలు ప్రసంగించారు. ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడుతూ ప్రభుత్వ అమలు పరిచిన సంక్షేమ పథకాలే పార్టీ కీ శ్రీరామరక్ష అని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విదంగా సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలుపరిచి దేశానికి ఆదర్శవంతమైన తెలంగాణగా, తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని అనేక అమలు అవుతున్న సంక్షమపదకాలను ఆయన గుర్తు చేశారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో డాక్టర్ తెల్లం వెంకటరావును గెలిపించు. కోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై, నాయకుడు పై, పార్టీ ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.ప్రజల మద్దతు బిఆర్ఎస్ పార్టీకే ఉందని, ఎన్నికల సమయంలో కనపడే రాజకీయ పార్టీల కల్లబొల్లి మాటలు నమ్మే స్థితిలో ఓటర్లు లేరని ఈ సందర్భంగా విమర్శించారు. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతి నిదులు నియోజకవర్గ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ,వారు చేసిన అభివృద్ధి ఏంటని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాత మధు సభాముఖంగా ప్రశ్నించారు. కేవలం పార్టీ సమావేశాలు, విమర్శలతోటే ఐదేళ్ల పదవీకాలం వెల్లబెట్టారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.ములుగు జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మణరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు జిల్లాలో ఉన్న వెంకటాపురం, వాజేడు మండలాలతో పాటు ములుగు జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యమని భద్రాచలం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటటరావు ను గెలిపించుకొని, భద్రాద్రి రాముడు కి, కానుకగా ముఖ్యమంత్రి కిఅందజేస్తామని ఈ సందర్భంగా సభాముఖంగా హర్షద్వానాల మధ్య ప్రకటించారు. పార్టీ సీనియర్ నాయకులు గుడవర్తి నరసింహమూర్తి ,మండల పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు, సీనియర్ నాయకులు అట్టం సత్యనారాయణ, వేల్పూర్ లక్ష్మీనారాయణ, సర్పంచి సంఘ అధ్యక్షురాలు పూనెం శ్రీదేవి, పార్టీ కార్యదర్శి పిల్లారిసెట్టి మురళి, రైతు సమన్వయ సమితి నేత బుచ్చయ్య, చిచ్చెడి శ్రీ రామమూర్తి, రామక్రిష్ణ , ముడుంబా శ్రీనివాస్, ఇంకా పలువురు ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మండలంలోని 18 గ్రామ పంచాయతీల నుండి పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ముఖ్య కార్యకర్తల సమావేశం కిటకిటలాడింది. సమావేశాన్ని సీనియర్ నేత గూడవర్తి నరసింహమూర్తి స్వగృహం వద్ద ఏర్పాటు చేయటంతో సభ వేదిక కార్యకర్తలతో గులాబీ మయంగా మారింది. ఈ సందర్భంగా వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రేఖ అశోక్ పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.