క్రీడా స్థలం మంజూరు చేయాలని తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత

క్రీడా స్థలం మంజూరు చేయాలని తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత

తెలంగాణ జ్యోతి, ఏటూరు నాగారం : మంగపేట మండల కేంద్రంలో క్రీడ మైదానానికి స్థలం కేటాయించాలని కోరుతూ మంగళవారం తాసిల్దార్ కు యువత వినతిపత్రం అందచేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 25 గ్రామపంచాయతీలకు చెందిన యువతకు చదువుతో పాటు క్రీడలు వారి ఎదుగుదలకు ఉపయోగపడతాయని, సరైన ఆట స్థలము లేని కారణంగా  పోటీ ప్రపంచంలో ప్రతిభను చాటలేక పోతున్నామన్నారు. ప్రతిభను మెరుగు పరుచుకు నేందుకు అధునాతన క్రీడా సామాగ్రీతో పాటు క్రీడా స్థలం ఏర్పాటు చేయాలని కోరారు. మండలంలో క్రీడా స్థలం లేక సరైన గుర్తింపు లేక ఎన్నో అవకాశాలను కోల్పోతున్నామన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడల్లో రాణించడం ద్వారా పోలీస్ శాఖలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ సరైన ఆటస్థలం లేని కారణంగా క్రీడలకు దూరంగా ఉండి ఉపాధి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మైదానాన్ని ఏర్పాటు చేయాలని యువత కోరారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment