Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుల సమావేశం

On: January 2, 2026 8:32 PM

విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుల సమావేశం

వెంకటాపురం నూగూరు, జనవరి2 (తెలంగాణజ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండల విద్యా వనరుల కేంద్రంలో శుక్రవారం మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మండల స్థాయి సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి టి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, డీఎస్సీ–ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం కింద రోజువారీ విద్యార్థుల సంఖ్యను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు. పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి, వారిని ఏబీసీడీ గ్రూపులుగా విభజించి స్పెషల్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. మండలంలోని ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ పాఠశాలలకు హాజరు కావాలని, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే అన్ని ఆన్‌లైన్ కార్యక్రమాల్లో మండలాన్ని ముందంజలో నిలపాలని సూచించా రు. హైస్కూల్ విద్యార్థులు ల్యాబ్స్, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి డిజిటల్ లెర్నింగ్ వేదికలను ఎక్కువగా వినియోగించేలా చర్యలు తీసు కోవాలని తెలిపారు. ఓఎస్‌సీ సర్వే వివరాలను న్యూ ప్రబంధ్ పోర్టల్‌లో నమోదు చేయాలని, విద్యార్థులను గ్రూపులుగా విభజించి వారి సామర్థ్యాలను పరీక్షించి మెరుగుపరచాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణ ద్వారా మూడు గ్రూపులుగా విభజించి వారి అభ్యాస సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. అదేవిధంగా మండలం లోని పాఠశాలల్లో అవసరానికి మించి ఉన్న బెంచీలను పునర్వ్యవస్థీ కరించి, వాజేడు నాగారం నుంచి వాజేడు‌కు 12 బెంచీలు, ప్రాథమికోన్నత పాఠశాల గుమ్మడిదొడ్డికి 7 బెంచీలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జయేందర్, సునీత, రామన్న, వెంకన్న తదితర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నట్లు వాజేడు ఎంఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!