పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సభ్యురాలు

Written by telangana jyothi

Published on:

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సభ్యురాలు

– రివార్డు అందజేసిన ఎస్పీ శబరీష్

ములుగు ప్రతినిధి : నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు స్వర్ణక్క ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈమేరకు బుధవారం జిల్లా ఎస్పీ శబరీష్ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఒడిస్సా రాష్ర్టం మల్కాన్ గిరి జిల్లా కలిమెల మండలం పొట్టేరు గ్రామానికి చెందిన అలువ స్వర్ణ అలియాస్ స్వర్ణక్క 2000ల సంవత్సరంలో కలిమెల ఏరియా కమాండర్ రామన్న ప్రోత్సా హంతో మావోయిస్టు పార్టీలో చేరారు. నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చట్టిరాజా పాపయ్య ప్రొటెక్షన్ టీంలో చేరి మూడేళ్లుగా సభ్యురాలిగా, అనంతరం మరో ఐదేళ్లు జంపన్నకు ప్రొటెక్షన్ టీం సభ్యురాలిగా పనిచేశారు. 2005లో రాంపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పాల్గొని తప్పించుకున్నట్లు ఎస్పీ వివరించారు. 2006లో వాజేడు మం డలం కొంగాలకు చెందిన కురుసం సాయన్న, అలియాస్ జగత్ ను పెళ్లి చేసుకుంది. 2008లో ఏరియా కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందిన స్వర్ణక్క హరిభూషన్, రామన్నలకు ప్రొటెక్షన్ గా పనిచేశారు. 2017లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్న తన భర్త జగత్ గుండం ఎదురుకాల్పుల్లో మృతిచెందగా కుంగిపోయిన స్వర్ణక్క ఆరోగ్యం క్షీణించింది. కాగా, మావోయిస్టు పార్టీ మనుగడసాగించే అవకాశం లేదని భావించిన అలువ స్వర్ణ, అలియాస్ స్వర్ణక్క కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ములుగు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయింది. కాగా, ఎస్పీ శబరీష్ రివార్డ్ అంద జేశారు. మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవా లని, వారికి ప్రభుత్వ పునరావాసం కల్పిస్తుందని ఎస్పీ పిలుపు నిచ్చారు.ఈకార్యక్రమంలో డీఎస్పీ,ఇన్చార్జి ఓఎస్డీ ఎన్.రవీందర్, సీఆర్పీఎఫ్39 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now