వయోవృద్ధుల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం

On: December 17, 2025 4:47 PM

వయోవృద్ధుల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం

వయోవృద్ధుల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.వి.పి. సూర్య చంద్ర కళ

ములుగు, డిసెంబర్ 17, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో  జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు వయోవృద్ధులు వారి నిర్వహణకు సంబంధించి న్యాయ సహాయం అందించేందుకు ములుగు సబ్ కలెక్టర్ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.వి.పి. సూర్య చంద్ర కళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వయో వృద్ధులను నిర్లక్ష్యం చేయడం, వారి సంరక్షణ బాధ్యతను విస్మరించడం వంటి అంశాలపై న్యాయ సహాయం అవసరమైన వారు ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే వయోవృద్ధుల సంక్షేమ చట్టం గురించి వివరించి, చట్టపరమైన హక్కులు, రక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టీ. కన్నయ్య లాల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమాదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సి.హెచ్. వేణుగోపాల చారి, ప్రధాన కార్యదర్శి ఆర్. బిక్షపతి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు మేకల మహేందర్, బానోత్ స్వామిదాస్, ప్యానెల్ లాయర్ దామల్ల సుధాకర్, న్యాయవాదులు పూజారి రవికుమార్, పారా లీగల్ వాలంటీర్ ఎన్. బాబు, డీఎల్‌ఎస్‌ఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!