వెంకటాపురం మండల కేంద్రంలో విరిగి పడిన భారీ వేప చెట్టు

వెంకటాపురం మండల కేంద్రంలో విరిగి పడిన భారీ వేప చెట్టు

– తృటిలో తప్పిన ప్రాణాపాయం.

వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా  వెంకటాపురం పట్టణంలో నిత్యం జనసంద్రంతో ఉన్న రావి చెట్టు సెంటర్లో శుక్రవారం సాయంత్రం భారీ వేప చెట్టు గాలి దుమారా లతో వేపచెట్టు విరిగిపడింది. విరిగిపడే సమయంలో షాపుల్లో కొనుగోలు చేసుకుందుకు వచ్చిన కొనుగోలుదారులు, షాపు యజమానులు చుట్టుపక్కల వారు పరుగులు తీశారు. చెట్టు విషయం తెలిసిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు  విద్యుత్ సరఫరాను ముందు జాగ్రత్తగా నిలిపివేశారు. వెంకటా పురం విద్యుత్ శాఖ ఏడిఈ ఆకిటి స్వామి రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది హుటాహుటిన జెసిబిలతో నేలకొరిగిన చెట్టును తొలగించే పనులు చేపట్టారు. భారీ వేప చెట్టు విరిగి పడిన సమయంలో చెట్టుకింద ఉన్న ప్రజలు పరుగులు తీయడం తో ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment