భారీ వర్షాలతో నష్టపోయిన రైతులని ఆదుకోవాలి

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులని ఆదుకోవాలి

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులని ఆదుకోవాలి

– సూడి కృష్ణారెడ్డి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు.

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో శుక్రవారం సిపిఎం పార్టీ జిల్లా సమావేశం  మండలపార్టి కార్యధర్శి గ్యానం వాసు అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా సూడి కృష్ణా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు ములుగు జిల్లాలో వందలాది ఎకరాలలో మామిడి తోటలో పిందెలు, కాయలు రాలిపోయి భారీ నష్టం జరిగిందని, కల్లాలలో మిర్చి తడిసి పోయిందని, అలాగే గోవింద రావుపేట మండలంలో వడగండ్ల వాన పడి చేతికి కొచ్చిన వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని జిల్లాలో వేలాది ఎకరాల మిర్చి పంట కోసి, ఆరబెట్టిన పళ్ళు తడిసి పొయాయన్నారు. అసలే ధరలు లేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే వ్యవ సాయ శాఖ, ఆర్టికల్చర్ శాఖ సర్వేలు నిర్వహించి నష్టపోయిన రైతుల ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు వరికి ఎకరాకు 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారని, మిర్చికి ఎకరాకు రూ.3 లక్షల పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడుతు న్నారని, ఇలాంటి పరిస్థితులు ఈ భారీ వర్షాలు రైతుల్ని ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభు త్వం సర్వే చేసి రైతులను ఆదుకోవాలని లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా మని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వెంకట్ రెడ్డి, ఎండి దావూద్, పొదిళ్ల చిట్టిబాబు, కొప్పుల రఘుపతి, జిల్లా కమిటీ సభ్యులు వంకా రాములు ,కట్ల నర్సింహ చారి, తీగల ఆదిరెడ్డి, గొంది రాజేష్, దుర్గి చిరంజీవి, జజ్జరి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment