పెంకవాగులో బిఆర్ఎస్ పార్టీకి భారీ గండి
– 50 ఆదివాసి కుటుంబాల కాంగ్రెస్ చేరిక
వెంకటాపురం,డిసెంబర్8,తెలంగాణజ్యోతి:ములుగుజిల్లావెంకటాపురం మండలం తిప్పాపురం పంచాయతీ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతం పెంకవాగు గ్రామానికి చెందిన 50 ఆదివాసి కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ దశాబ్ద పాలనలో చేసిన అభివృద్ధి కానరాలేదని, మారుమూల గ్రామాలకు సంక్షేమ పథకాలు చేరలేదని గ్రామస్తులు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం చేపడుతున్న గిజనాభివృద్ధి కార్యక్రమాలు, పేదల సంక్షేమ పథకాలు ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాయని, ఈ నేపథ్యంలో తమ గ్రామం మొత్తం కాంగ్రెస్ వైపు వస్తోందని వారు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు నూతనంగా చేరిన ఆదివాసీ కుటుంబాలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తూ, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులను విజయవంతం చేయాలని గ్రామస్తులను కోరారు.








