వాయిస్ ఆఫ్ జాయిన్ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది :ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రము లో గల గొల్ల గుట్ట పరిధి లో ఉన్న వాయిస్ ఆఫ్ జాయిన్ చర్చ్ లో సోమవారం ఘనంగా క్రిస్మస్ వేడు కలను నిర్వహించారు. మండల ప్రజలకు క్రిస్మస్ శుభకాంక్షలు తెలి యజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ గట్టిపల్లి తీమోతి క్రిస్మస్ సందేశం లో క్రీస్తు పుట్టుక,ప్రజలందరికీ రక్షణ ఇస్తుంది అని, మానవుల రక్షణ కొరకు ఈ భూమి మీద అవతరించాడని బోధిం చారు. తరువాత క్రిస్మస్ కేక్ కట్ చేసి, ప్రజలందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం ఆయుస్సు కలిగి జీవించాలని ప్రార్దనలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో పాస్టర్ గట్టుపళ్లి తీమోతి, టేకులగుడెం జి.విశ్రాంతి అమ్మగారు,సంఘ సభ్యులు, నాని బాబు, మరియమ్మ, ఎస్తేర్, సుసన్న తదితరులు చిన్నలు, పెద్దలు పాల్గొని సందడి చేశారు.
1 thought on “వాయిస్ ఆఫ్ జాయిన్ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు”