శిరిడీ సాయిబాబా మందిరంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం
వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 11, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న శ్రీ శిరిడీ సాయిబాబా మందిరం వద్ద ఈరోజు గురువారం భక్తి పూర్వకంగా అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి గురువారం జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాన్ని శ్రీ సాయిబాబా భక్తమండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. అన్నప్రసాద కార్యక్రమాన్ని భక్తుడు, స్థానికులు మరియు సీనియర్ జర్నలిస్టు సుద్దపల్లి సత్యనారాయణ దంపతులు ప్రత్యేకంగా సేవలో పాల్గొని భక్తులందరికీ ప్రసాదాన్ని సమర్పించారు. “ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి” నామస్మరణతో హారతి ఇచ్చి కార్యక్రమాన్ని సాయి భక్తమండలి ప్రారంభించింది. ఈ సందర్భంగా పాల్గొన్న భక్తులు “అన్నదాత సుఖీభవ” అంటూ ఆశీర్వచనాలు పలికి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






