అభయ హస్తానికి వెల్లువెత్తిన దరఖాస్తుల వెల్లువ
తెలంగాణజ్యోతి, కాటారం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తంలో భాగంగా ఐదు గ్యారెంటీ అమలుకు గురువారం కాటారం మండలంలోని ఆరు గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్వహించి, దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం 8.00 గంటల నుండి కాటారం మండలంలోని ఆరు గ్రామపంచాయతీలలో వీరాపూర్ బయ్యారం, మద్దులపల్లి, ప్రతాపగిరి, ధర్మసాగర్, ధన్వాడ గ్రామ పంచాయతీ లయందు ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శలు, టీం లీడర్స్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈనెల 28 నుండి జనవరి 06 వరకు చేపట్టిన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకములకు ప్రతి గ్రామపంచాయతీ యందు గ్రామసభ, దరఖాస్తు స్వీకరణ కోసం ప్రజా పాలన కార్యక్ర మం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ అధి కారి, డాక్టర్ కె నారాయణ, మండల ప్రత్యేక అధికారి సంజీవరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం శంకర్ నాయక్, మండల పంచాయతీ అధికారి ఉపేంద్రయ్య, డివిజనల్ ఇంజనీర్ రమేష్, తాసిల్దార్ నాగరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజశేఖర్ పర్య వేక్షించా రు. అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆరు గ్రామపంచాయతీల యందు 405 దరఖాస్తులు స్వీకరించినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శంకర్ నాయక్ తెలిపారు.
1 thought on “అభయ హస్తానికి వెల్లువెత్తిన దరఖాస్తుల వెల్లువ”