పాకాల సరస్సులో చేపల వేటకు దిగిన వ్యక్తిపై మొసలి దాడి

Written by telangana jyothi

Published on:

పాకాల సరస్సులో చేపల వేటకు దిగిన వ్యక్తిపై మొసలి దాడి

– గోప్యంగా ఉంచిన స్థానికులు

తెలంగాణ జ్యోతి, ఖానాపూర్ : పాకాల సరస్సు లో చేపల వేటకు దిగిన వ్యక్తిపై మొసలి దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బుధరావుపేట గ్రామానికి చెందిన మురళి పాకాల చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మొసలి అతడిపై దాడి చేసింది. ఈ ఘటనలో మురళికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మురళి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment