నాలుగు కాళ్లతో కోడి పిల్ల జననం.. చూసేందుకు జనం క్యూ
వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 19 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లో కోడి గుడ్డు పగలగొట్టుకుని నాలుగు కాళ్లతో కోడి పిల్ల బయటకు వచ్చింది. అదే కోడి నుంచి పుట్టిన మిగతా కోడి పిల్లలు అన్నీ సాధారణంగానే ఉండగా, ఒక్క కోడి పిల్ల మాత్రం నాలుగు కాళ్లతో కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వింత కోడి పిల్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కొందరు సోషల్ మీడియాలో పంచుకోవడంతో విషయం వేగంగా ప్రచారం అవుతోంది.






