రేపు తెలంగాణ బంద్‌కు బిఆర్ఎస్ పిలుపు..!

Written by telangana jyothi

Published on:

రేపు తెలంగాణ బంద్‌కు బిఆర్ఎస్ పిలుపు..!

హైదరాబాద్, తెలంగాణ జ్యోతి : తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తిర‌గ‌బ‌డుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం లేద‌ని నిరుద్యోగులు మండిప‌డుతున్నారు. జాబ్ క్యాలెండ‌ర్ వెంట‌నే విడుద‌ల చేయాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నిరుద్యో గుల స‌మ‌స్య‌ల‌పై నిరుద్యోగ జేఏసీ ఉద్య‌మ నాయ‌కుడు మోతీలాల్ నాయ‌క్ గాంధీ ఆస్ప‌త్రిలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష కొన‌సాగిస్తున్నారు. అయితే మోతీలాల్ నాయ‌క్‌ను ప‌రామ‌ ర్శించేందుకు గాంధీ హాస్పిట‌ల్‌కు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ బ‌హిష్కృత నేత బ‌క్క జ‌డ్స‌న్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బ‌క్క జ‌డ్స‌న్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నిరుద్యోగ‌ల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించ‌లేక‌పోతున్న రేవంత్ రెడ్డి త‌క్ష‌ణ‌మే ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మ‌ల్ల‌న్న ఎక్క‌డ దాక్కున్నాడ‌ని నిల‌దీశారు. నిరుద్యోగుల స‌మ‌స్య‌లు కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదా..? అని బ‌క్క జ‌డ్స‌న్ తీవ్ర ఆగ్ర‌హం వెలిబుచ్చారు. నిరుద్యోగుల స‌మ‌స్య‌ల మీద పోరాటంలో భాగంగా మంగ‌ళ‌వారం తెలంగాణ బంద్‌కు బ‌క్క జ‌డ్స‌న్ పిలుపునిచ్చారు. నిరుద్యోగులంతా ఏక‌మైన ఈ బంద్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న కోరారు.

నిరుద్యోగుల డిమాండ్లు ఇవే..

గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి.

గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి.

జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి

25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.

నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి నేత మోతీలాల్‌ నాయక్‌కు బీఆర్‌ఎస్‌ సహా వివిధ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నాయి. ఆదివారం గాంధీ దవాఖానకు వెళ్లిన ఎమ్మెల్యే హరీశ్‌రావు సహా పలువురు నేతలు మోతీలాల్‌ నాయక్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ, యువజన నేతలు, ఓయూ ప్రొఫెసర్లు నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now