ఇండియన్ పెట్రోల్ బంక్ లో సివిల్ సప్లై అధికారుల తనిఖీలు
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని చిన్న బోయినపల్లిలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బంక్ నిర్వాహకులు పెద్ద మొత్తంలో డీజిల్, పెట్రోల్ ఇసుక క్వారీల్లో పనిచేస్తున్న భారీ వాహనాలకు తరలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. బంక్ సంబంధిత పత్రాలు, లైసెన్స్, పెట్రోల్, డీజిల్ నిల్వల సమాచారం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లయ్ డీఎం రాంపతి హెచ్చరించారు. ఈ తనిఖీల్లో DTCS రామచందర్ పాల్గొన్నారు.