ఇంకా ఎన్నాళ్ళు రవాణా కష్టాలు..వర్షాకాలం వస్తే రాకపోకలు బంద్…

Written by telangana jyothi

Published on:

ఇంకా ఎన్నాళ్ళు రవాణా కష్టాలు..వర్షాకాలం వస్తే రాకపోకలు బంద్…

-ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు ఆవేదన.

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో మారుముల ప్రాంతమైన ఐలాపూర్ గ్రామ ప్రజలకు రవాణా కష్టాలు తిప్పలు తప్పడం లేదు. రోడ్లు లేక కన్నాయిగూడెం మండలానికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం కొండాయి నుంచి ఐలాపూర్ గ్రామానికి తార్ రోడ్ మంజూరు చేశారు. కానీ రోడ్డు ప్రారంభంలో ఫారెస్ట్ అధికారులు పనులను అడ్డుకున్నారు. సమ్మక్క సారక్క మినీ జాతర సమయంలో మాత్రమే రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు.వర్షాకాలం వచ్చిం దంటే గ్రామస్తులకు రాకపోకలు నిలిచిపోతాయి. వర్షాకాలం లో ఇటీవల గ్రామాన్ని ముట్టేసిన వాగు, దీంతో వాగులకు బ్రిడ్జి మరియు మెరుగైన వైద్యం లేక ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఆరోగ్య ఉపకేంద్రం భవనం ఉన్నట్లయితే ప్రాణాలు కాపాడుకోవచ్చునని వారు కోరుతున్నారు. భయం గుప్పిట్లో బ్రతుకుతున్నామని వారి గోడును వెల్లబోసుకుంటున్నారు.  ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా మా బ్రతుకులు కలగానే, కాగితాలకే పరిమితం అవుతుందని, ముఖ్యంగా గర్భిణీలు బాలింతలకు వైద్య సేవలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలంలో గర్భిణీలు, బాలింతలకు ప్రతీ వారం వైద్య పరీక్షలు చేసే సమయంలో, చంటి పిల్లలకు వ్యాక్సిన్ వేసే సమయంలో అవస్థలు పడుతున్నారు. గ్రామానికి పిహెచ్ సి లకు చాలా దూరంలో ఉంటాయి. దీంతో గ్రామంలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఉండాల్సిన ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణం కరువైంది. మా ఐలాపూర్ గ్రామానికి ఆరోగ్య ఉపకేంద్రం భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రహదారిపై అధికారులు దృష్టి సారించాలి

– అంబెడ్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షుడు వాసంపల్లి మధుకర్(గుర్రెవుల)

విద్య, వైద్యం నిత్యావసరలకు వెళ్లాలంటే నరకయాతన పడాల్సి వస్తోంది. తాత ముత్తాల కాలం నుంచి అవే రోడ్లు, ఐలాపూర్ గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తారు రోడ్డు,ఆరోగ్య ఉపకేంద్రం భవనం మంజూరు చేయాలని కోరుతున్నాను.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now