కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరిలో యువకుడు గల్లంతు

Written by telangana jyothi

Published on:

కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరిలో యువకుడు గల్లంతు

కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా,కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి నదిలో యువకుడు గల్లంతయ్యాడు. గోదావరిలో స్నానం చేస్తుండగా ప్రమాద వశాత్తు గోదావరిలో గల్లంతయ్యాడు. వరంగల్ పట్టణానికి చెందిన గరికపాటి అఖీల్(19) గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గోదావరి తీరానికి చేరుకొని బోటులో స్వయంగా గల్లంతైన ప్రాంతాన్ని పరిశీలిం చారు. గోదావరిలోకి దిగి స్తానిక జాలరులకు తగు సూచనలు చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Leave a comment