ఎమ్మెల్సీ పోలింగ్ సరళిని పరిశీలించిన ఎస్పి కిరణ్ ఖరే
తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో పట్ట భద్రుల ఎం ఎల్ సీ ఉప ఎన్నికల భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, అక్కడ పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న పోలిసు అధికారులు, సిబ్బందికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే పలు సూచనలు చేశారు. ఎం ఎల్ సీ పట్ట భద్రుల ఉప ఎన్నికల్లో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టిష్టమైన బందోబస్త్ నడుమ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది.