చాలు, చాలు, “చల్లా” ఇక ఆపు, అసత్య ఆరోపణలు

Written by telangana jyothi

Published on:

చాలు, చాలు, “చల్లా” ఇక ఆపు, అసత్య ఆరోపణలు

– కాటారం కాంగ్రెస్ నేతల వార్నింగ్

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమసే శ్రీను, మాజీ పీ ఏ సీ ఎస్ చైర్మన్, బీజేపీ నాయకులు చల్ల నారాయణ రెడ్డి లు మంత్రి శ్రీధర్ బాబు మీద చేసిన అనుచిత వాక్యలను కాటారం మండలం కాంగ్రెస్ పార్టీ ఖండిచింది. చాలు, చాలు, చల్లా … ఇక ఆపు, అసత్య ఆరోపణలు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లా డుతూ చల్ల నారాయణ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం దివంగత నేత శ్రీపాద రావు తో మొదలుపెట్టి శ్రీధర్ బాబుతో నీ రాజకీయ ప్రయాణం కొనసాగించావని , నీకు రాజకీయంగా పలు మార్లు సర్పంచ్, ఎంపీటీసీ, సహకార సంఘం అధ్యక్షుడుగా ఎంపీపీ, జడ్పిటిసి గా నీకు అవకాశం ఇస్తే పదవులను అడ్డం పెట్టుకొని భూ కబ్జాలకు పాలుపడ్డావని కాంగ్రెస్ పార్టీ నేతలు ఘాటుగా విమర్శించారు. రాజకీయ స్వలాభం కోసం పూటకో పార్టీ మారుతూ ప్రజల్లో ఉనికి కోల్పోయి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నావని చల్ల నారాయణ రెడ్డి ని ఉద్దేశించి అన్నారు. ఇదే చల్ల నారాయణ రెడ్డి సొసైటీ చైర్మన్ గా ఉన్న సమయం లో మండలంలోని రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసి, నేడు నీతి వాక్యాలు మాట్లాడుతున్నావని ఎద్దేవా చేశారు. సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకుండా, తరుగు పేరుతో కట్టింగ్ చేసి రైతుల శ్రమను దోచుకొని నేడు రైతుల మీద కపట ప్రేమ నటిస్తున్నావని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేసిన 2-3 నెలల వరకు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయకుండ ఇబ్బందులు కల్పించినావు , కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేవలం 3-5 రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాలో డబ్బులను జమ చేయడం జరుగుతుందనీ వివరించారు.ప్రజలలో నీ ఉనికిన కాపాడుకోవడం కోసం మరోసారి మా నాయకులు మంత్రి శ్రీధర్ బాబు మీద అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్, ఎంపీటీసీ జాడి మహేశ్వరి, జిల్లా కాంగ్రెస్ నాయకులు కుంభం రమేష్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి అంగోతు సుగుణ, మాజీ సర్పంచులు తెప్పల దేవేందర్ రెడ్డి, దెబ్బెట రాజేష్, అజ్మీర రఘురాం నాయక్, అంగజాల అశోక్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మజీద్, కొట్టె ప్రభాకర్, పసుల మొగిలి, రాజబాబు గౌడ్, మహిళా నాయకురాలు సుజాత, యూత్ కాంగ్రెస్ నాయకులు, శ్రీకాంత్, కిరణ్, మొగిలి రాజ్ కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now