కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా రాణా ప్రతాప్ 

Written by telangana jyothi

Published on:

కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా రాణా ప్రతాప్ 

తెలంగాణజ్యోతి, కరీంనగర్ :  కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గట్టు రాణాప్రతాప్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రాణా ప్రతాప్ స్వగ్రామం ములుగు జిల్లా లక్ష్మి దేవి పేట. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాల బండారుపల్లిలో ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసం చేసిన రాణా ప్రతాప్.. డిగ్రీ వరంగల్ లాల్ బహదూర్ కళాశాలలో పూర్తి చేశాడు. అలాగే ఎం ఏ ఇంగ్లీష్ లిటరేచర్ ను కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేశాడు. రాణా ప్రతాప్ కు ఆరో తరగతి నుండి రాజకీయాలంటే ఆసక్తి. లాలు ప్రసాద్ యాదవ్ ను ఆదర్శంగా రాణా తీసుకున్నాడు. రామ్ మనోహర్ లోహియా జీవితాన్ని అధ్యయనం చేశాడు. ఏఐఎస్ఎఫ్ లోను క్రియాశీలకంగా పనిచేశాడు. తద్వారా సోషలిస్ట్ రాజకీయాల వైపు ఆకర్షితుడై సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లో చేరి ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా రాణా మాట్లాడుతూ.. యువత ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని, యువత చదువుతోపాటు, ఉద్యోగంతో పాటు.. రాజకీయాలు, ప్రజాసేవ గురించి ఆలోచించాలని ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనాలని కోరారు. ప్రస్తుత రాజకీయాలు అవినీతిమయమయ్యాయని, రాజకీయ నాయకులు ఫక్తు వ్యాపారత్మకంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వాలు ప్రజాసేవ గురించి పట్టించుకోవడంలేదని రాణా ప్రతాప్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను సామాన్య నిరుపేద కుటుంబం నుండి వచ్చానని, ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించిందని అన్నారు. ప్రస్తుతం దేశ సంపద అంతా కొద్దిమంది చేతుల్లోకి వెళుతుందని, పేదలు పేదలుగానే ఉంటుండగా ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని.. మన రాజ్యాంగంలో సోషలిస్టు అన్న పదం వాడినప్పటికీ.. నిరుపేదల పరిస్థితులు మాత్రం మారడం లేదని అన్నారు. ఇప్పటికీ పేదరికం, వలసలు, నిరుద్యోగం వంటి సమస్యలు ఉన్నాయని.. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా.. ఇంకా సమస్యల గురించే మాట్లాడుకుంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలకు చిత్తశుద్ధి రాజకీయ నేతలకు చిత్తశుద్ధి కొరవడిందని, ప్రభుత్వాలు నిరుపేదలపై భారం మోపుతు న్నాయని, ఇంకా కోట్లాదిమంది తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రాజకీయాల్లో సంబుల మార్పులు తీసుకురావడానికి యువత ఒక ఉద్యమంలో ఒక తరంగంలా కదిలి రావాలని కోరారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించి చెరకు రైతు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాగా అభ్యుదయ భావాలతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న నిరుద్యోగ యువకుడు రాణాప్రతాప్ ను పలువురు అభినందిస్తున్నారు.

Tj news

1 thought on “కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా రాణా ప్రతాప్ ”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now