పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలి
– జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర
తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి : పోలింగ్ కేంద్రా లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మిని కాన్ఫరెన్స్ హాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బందికి భోజన సౌకర్యం తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సంద ర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికలకు కోసం పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. పోలింగ్ సిబ్బంది ఒక్కరోజు ముందుగానే 12వ తేదీనే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు కాబట్టి పోలింగ్ సిబ్బందికి భోజనం, వసతి ఏర్పాట్లుతో పాటు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించాలని తెలిపారు. పోలింగ్ రోజు భోజనం, స్నాక్స్ అందించాలని అన్నారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో బస చేసేందుకు ఏర్పాట్లుతో పాటు పోలింగ్ కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. పోలింగ్ ముందు రోజు చేయాలని, ప్రతి పోలింగ్ కేంద్రాలలో సంమృద్ధిగా త్రాగునీరు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వేసవి దృష్ట్యా సిబ్బందికి మజ్జిగ, అలాగే సాయంత్రం అరటి పండ్లు అందించాలన్నారు.వేసవి నీ దృష్టిలో ఉంచుకొని నీడ కొరకు టెంట్లు, చైర్స్, మరుగుదొడ్లు, అవసరాలకు నీరు, విద్యుత్ సౌకర్యం ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. మైక్రో లెవల్ ప్లానింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులకు మల్టి పర్పస్ సిబ్బందిని కేటాయించాలని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రంతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో, రిసెరప్షన్ కేంద్రంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అన్నారు. అనుభవజ్ఞులైన ప్రత్యేక వైద్యులు అందుబాటులో ఉంచాలని, ఏదేని అత్యవసర సేవలకు సి.పి.ఆర్ తెలిసిన వైద్యులను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రధాన వైద్య శాలలో అత్యవసర వార్డు ఏర్పాటు చేయాలన్నారు. అంబులెన్స్ ల్, స్ట్రెచర్, వీల్ చైర్స్, అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల అత్యవసర వైద్య కేంద్రం ఏర్పాటుతో పాటు తగినన్ని మందులు ఓ ఆర్ ఎస్ పాకెట్స్ ఏర్పాటు చేయాలని, సెక్టార్ అధికారులను సమన్వయం చేసుకోవాలని డిస్ట్రి బ్యూషన్ కేంద్రం వద్ద ఫైరింజన్ ను అందుబాటులో ఉంచాలని సూచించారు.భూపాలపల్లి మున్సిపాల్టీ పరిధిలో 48 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని పోలింగ్ రోజు పూర్తి స్థాయిలో మున్సిపల్ ఉద్యోగులను అందుబాటులో ఉంచాల ని, పోలింగ్ కేంద్రాలలో ఒక్కరోజు ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలనీ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ల లో ఓటర్లు కు ఇబ్బందులు కలగకుండా టెంట్లు, కుర్చీలు, త్రాగునీరు,క్యూలైన్లలో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఒకటి కంటే ఎక్కువ గా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యూలైన్ల ను ఏర్పాటు చేసి పోలింగ్ స్టేషన్ దారి చూపించే విధంగా గుర్తులను ఏర్పాటు చేయాలన్నారు. ఒకచోటు నుండి మరొక చోటుకు మారిన పోలింగ్ కేంద్రాలను ఓటర్లు గుర్తించేందుకు వీలుగా సూచిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 9 మోడల్ పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేస్తున్నామని, మోడల్ పోలింగ్ కేంద్రాలను సర్వాంగ సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని తెలిపారు. వీఐపీలు వచ్చే పోలింగ్ కేంద్రాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఓటు హక్కు వినియోగం బహిర్గతం చేయొద్దని, ఫోటోలు, వీడియోలు తీయడం నిషేదమని సెల్ ఫోన్లు అనుమతించొద్దని తెలిపారు. ప్రత్యేక అధికారులు పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేయాలని ఆదేశించారు. 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున 3 బి.యు లు ఏర్పాటు చేయనున్నందున 13వ తేదీ ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభించాలన్నారు.పోలింగ్ రోజు వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న దివ్యాన్గులకు, గర్భిణిలు, మంచానికే పరిమితమైన వ్యక్తుల కొరకు ఉచిత వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి 279 ప్రత్యేక ఆటోలను ఏర్పాటు చేశామని అన్నారు. వయో వృద్ధులు, దివ్యాంగులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి సత్వరం ఓటు హక్కు వినియో గించుకునే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు 12వ తేదీ న వారికి కేటాయించిన మండలాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు. ఏర్పాట్లులో ఎలాంటి సమస్య ఉన్నా వాట్సప్ ద్వారా తెలుపాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఆర్డిఓ మంగి లాల్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
1 thought on “పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలి”