వైభవంగా బీరన్న బోనాల పండుగ

Written by telangana jyothi

Published on:

వైభవంగా బీరన్న బోనాల పండుగ

– 500ల బోనాలతో స్వామికి నైవేద్యం

– ఆలయం వద్ద ఒగ్గు, బీరన్న భక్తుల ప్రదర్శనలు

– మరో మూడు రోజులు వేడుకలు

తెలంగాణజ్యోతి, ములుగుప్రతినిధి: ములుగులో యాద వుల ఆరాధ్య దైవం బీరన్న పండుగ అంగరంగ వైభవంగా కొనసాగు తోంది. వారం రోజులపాటు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో సోమవారం తెల్లవారుజామున 500 బోనాలతో తరలివచ్చిన మహిళలు సామూహికంగా బీరన్న స్వామి వద్దకు కదిలారు. బీరన్న, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు స్థానికంగా అలరించాయి. ములుగులోని ఎస్బిహెచ్ రోడ్డులో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతి యాదవ కుటుంబం నుంచి బోనం తీసుకుని వచ్చి స్వామికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా డోలు సన్నాయి వాయిద్యాలతో ప్రత్యేకంగా స్వామిని కొలుస్తూ ఒగ్గు కళాకారులు కథలు చెప్పారు. సుంకు ముగ్గు వేసి ప్రతీ ఇంటికీ బియ్యం పంపిణీ చేయగా మహిళలు బోనం వండి తీసుకొచ్చి బీరన్న స్వామికి సమర్పించారు. ఈ సందర్భంగా చారిత్రాత్మకమైన పాటలు పాడుతూ డోలు, సన్నాయి వాయిద్యాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సోమవారం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు అనంతరం పట్నం వేసి స్వామికి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా యాట మొక్కులు చెల్లిం చారు. సాయంత్రం బోనాలు తిరిగి ఇంటికి చేరుకోవడంతో నేటి తంతు ముగిసిందని పూజారులు తెలిపారు. బీరన్న ఉత్సవాల నిర్వహణకు రాష్ర్ట మంత్రి సీతక్క రూ.లక్ష, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ రావు రూ.50వేలు విరాళం అందించగా పలువురు భక్తులు సైతం పండుగ నిర్వహణకు విరాళాలు అందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా మంగళవారం సందుబోనం, నాగెల్లి బోనాలు నిర్వహిస్తారని, బుధవారం నాగెల్లి పట్నం నిర్వహించ నున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ, పూజా కమిటీ సభ్యులు గోపు చంద్రమళ్లు, గొర్రె అంకూస్, బైకాని చిన్నకొమురయ్య, బైకాని బైకులు, ఇమ్మడి రమేష్, కొనుపుల కుమార్, బైకాని సాగర్, గుండెబోయిన కుమార్, బైకాని నటరాజ్, బండారి కుమార్, జక్కుల రమేష్, గోపు బొందయ్య, బోయిని రాజు, బోళ్ల రవి, గుండెబోయిన పోశాలు, ఎల్లావుల సమ్మయ్య, గండ్రకోట కుమార్, ఇమ్మడి మల్లయ్య, బైకాని ప్రకాష్, బైకాని రాజశేఖర్, ఇమ్మడి రాజు, బొంతల వేణు, ఒజ్జల కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Tj news

1 thought on “వైభవంగా బీరన్న బోనాల పండుగ”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now