ఏటూరునాగారం చేరిన రాములోరి తలంబ్రాలు
ఏటూరునాగారం,తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలంలో కొలువై ఉన్న రాముల వారి నుంచి ఏటూరునాగారం మండల పరిధిలో ఉన్న రామాలయాలకు తలంబ్రాలను అక్కడి ఆలయ నిర్వాహకులు గురువారం పంపిణీ చేయగా ఏటూరునాగారం చేరుకున్నాయి. కాగా, ఏటూరునాగారం రామాలయం కమిటీ చైర్మన్ మోడెం రమేష్, అడహక్ కమిటీ సభ్యులు బాలోజీ బ్రహ్మం, అలువాల శ్రీనివాస్, అర్చకులు యల్లా ప్రగడ నాగేశ్వర్ రావు శర్మలు వాటిని ఏటూరునాగారం క్రాస్‌రోడ్డు లోని ఆంజనేయస్వామి ఆలయానికి తరలించారు. ఇక్కడి నుంచి శ్రీరామ నవమి ఒక రోజు ముందు మేళతాళాలతో తలంబ్రాలను రామాలయానికి చేర్చనున్నట్లు ఆలయ చైర్మన్ రమేష్ తెలిపారు. అంతేకాకుండా మండలంలోని రామాలయాలకు కూడా ఈ తలంబ్రాలను పంపిస్తున్నట్లు రమేష్ వెళ్లడిం చారు. ఈనెల 16వ తేదీన జరగబోయే తలంబ్రాల ఊరేగింపు కార్యక్ర మానికి అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.