మంథని అసెంబ్లీ కో-ఆర్డినేటర్‌గా ఎర్రవెల్లి విలాస్ రావు

మంథని అసెంబ్లీ కో-ఆర్డినేటర్‌గా ఎర్రవెల్లి విలాస్ రావు

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మంథని అసెంబ్లీ కో-ఆర్డినేటర్‌గా ఎర్రవెల్లి విలాస్ రావు నియమితులయ్యారు. లోకసభ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మంథని అసెంబ్లీ కో ఆర్డినేటర్ గా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రవెల్లి విలాస్ రావు ను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్య క్షుడు శివసేన రెడ్డి నియమించారు. తన నియామకానికి సహకరిం చిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కు, దుద్దిల్ల శ్రీను బాబు కు విలాస్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్న పార్లమెంట్ పరిదిలో మంథని నుండి అత్యధిక మెజారిటీ తెచ్చేలా అలాగే పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రాహుల్ గాంధీకి కానుకగా ఇవ్వనున్నట్లు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గo మంథని అసెంబ్లీ కో -ఆర్డినేటర్ ఎర్రవేల్లి విలాస్ రావు తెలిపారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment