రంజాన్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎంపీ అభ్యర్థి
తెలంగాణ జ్యోతి ప్రతినిధి ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల కేంద్రంలోని పాత స్టేట్ బ్యాంక్ ఆవరణలో ఉన్నటువంటి మసీదులో జరిగినటువంటి రంజాన్ వేడుకలలో జడ్పీ చైర్మన్ నాగజ్యోతి, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ అభ్యర్థి కవిత లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాం క్షలు తెలియజేశారు. ఏటూరునాగారం యువత, ప్రజలు సుఖ సంతోషా లతో ఉండాలని వారు కోరుకుంటూ మేము అంత ముస్లిం సోదరులైన హిందువులైన అంతా కలిసి ఉంటామని, కుల మతాలకతీతంగా అన్న దమ్ముల వలే కలిసి ఉంటామని ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణరావు అన్నారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమా వేశంలో పాల్గొన్నారు.