పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలి

పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలి

– జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే 

తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి:ప్రతి కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో బుధవారం జిల్లా పరిధిలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్ ఐ లతో ఎస్పి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా పోలీస్‌స్టేషన్లలో నమోదైన గ్రేవ్‌ కేసులను పరిశీలించారు. ఆయా కేసులకు సంబంధించి అధికారులు సేకరిస్తున్న అధారాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్‌ అధికారులు సమర్ద వంతంగా విధులు నిర్వర్తించాలన్నారు. పాత నేరస్తులు, సమస్యాత్మక వ్యక్తులు, రౌడీషీటర్ల కదలికలను ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మద్యం, నగదు అక్రమ రవాణాను నిరోధించడంలో భాగంగా చెక్‌పోస్ట్‌లలో విధులు నిర్వర్తించే సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. సరిహద్దు రాష్ట్రాల పోలీస్‌ అధికారులతో సమన్వయంతో విధులు నిర్వర్తించా లని, ఎవరైనా సరైన ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు మించి నగదును రవాణా చేస్తూ పట్టుబడితే, ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేయాలని పేర్కొన్నా రు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని ఎస్పి హెచ్చరించారు. దొంగతనం కేసుల విచారణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిం చుకొని నేరస్తులను పట్టుకోవాలని, సొత్తును రికవరీ చేసి బాధితులకు త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి, కాటారం, వర్టికల్ డిఎస్పీలు ఏ. సంపత్ రావు, జి. రామ్మోహన్ రెడ్డి, నారాయణ నాయక్, డిసిఆర్బి, ఎస్బి ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, వసంత్ కుమార్, భూపాలపల్లి, కాటారం, చిట్యాల, మహాదేవ్ పూర్, సిఐలు నరేష్ కుమార్, నాగార్జున రావు, మల్లేష్ , రాజేశ్వర్ రావు, జిల్లా పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment