పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ జ్యోతి, కాటారం : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి లో కాటారం మండలం విలాసాగర్ గ్రామ మాజి సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అందే సత్యనారాయణ భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఆమె పార్థివ దేహానికి పూల మాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులని పరామర్శించి తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.