హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలకు ఆహ్వానం 

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలకు ఆహ్వానం 

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి :  హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని చిత్రా మిశ్రా ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లాలలో ఆరేసి చొప్పున విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి జిల్లా నుంచి ముగ్గురు బాలికలు, ముగ్గురు బాలురకు లక్కిడిప్ ద్వారా ఎంపిక చేయనున్నట్టు వివరించారు. హైదరాబాదు బేగంపేట, రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో మొదటి తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. కోయ మూడు సీట్లు, సుగాలి ,లంబాడి రెండు సీట్లు, ఇతర ట్రైబ్స్ ఒకరు రిజర్వేషన్లు ఉన్నట్లు వివరించారు. మార్చి 11 నుంచి ఐటీడీఏ ములుగు జిల్లా ఎటూరునాగారంలో దరఖాస్తు ఫారంలకు సంప్రదించి, 17 మార్చి లోగా దరఖాస్తులను కార్యాలయంలో అందజేయుటకు ఆఖరు తేదిగా పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment