వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

– ట్రాఫిక్ చలాన్ చెల్లింపునకు గడువు పెంపు

– ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలి : వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి :  ట్రాఫిక్ చలాన్స్ చెల్లింపునకు ప్రభుత్వం గడువును పొడిగించిందని ,ఈ అవకాశాన్ని పెండింగ్ చలానాలు ఉన్న వాహనదారులు ఉపయోగించుకోవాలని వెంకటాపూర్ ఎస్ఐ చల్ల రాజు కోరారు. ఈ మేరకు ఆయన గురువారం పోలీస్టేషన్ లో విలేకరులతో మాట్లాడారు.. రాష్ట్ర ప్రభుత్వం వాహనదారు లకు శుభవార్త ప్రకటించిందని అన్నారు. ఈ మేరకు బుధ వారం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. వాస్తవానికి పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు బుధవారం తో ముగిసిందని అన్నారు. ఈ నెల 10 న చివరి రోజు కావడంతో రూ. 107 కోట్ల చలాన్లు ఒకే రోజు వసూళు అయినట్లు ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఇంకా చాలా మంది ప్రజలు తమ వాహనాలకు సంబంధించి పెండింగ్ చలాన్స్ చెల్లించాల్సి ఉందని, లాస్ట్ డేట్ కావడంతో అందరూ ఒకేసారి ఈ-చలాన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశారని , దాంతో సైట్ స్లో అయ్యిందని వెల్లడించారు.దీంతో పెండింగ్ చలాన్స్ చెల్లించేందుకు గడువు పొడిగించాలని వాహనదారులు విజ్ఞప్తి చేశారని, ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం పెండింగ్ చలాన్ చెల్లింపునకు గడువును జనవరి 31వరకు పొడి గించిందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని వాహన దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment