విద్యార్థులకు సంక్రాంతి ముగ్గుల పోటీలు. 

విద్యార్థులకు సంక్రాంతి ముగ్గుల పోటీలు. 

– గెలుపొందిన వారికి బహుమతులు.

 తెలంగాణ జ్యోతి, వెంకటాపురం : సంక్రాంతి పర్వదినం సందర్భంగా శుక్రవారం 12వ తేది నుండి ప్రభుత్వ పాఠ శాలలకు సెలవులు ప్రకటించడంతో గురువారం పాఠశాల పని దినం కావడంతో విద్యార్థులకు పాఠశాల ఆవరణలో సంక్రాం తి ముగ్గుల పోటీలను నిర్వహించారు. చిన్నారులు వేసిన అందమైన ఆకర్షణీయమైన ముగ్గుల ను ఎంపిక చేసి బహు మతులు పంపిణీ చేశారు. ములుగు జిల్లా వెంకటాపు రం, వాజేడు మండలాల్లోని పాఠశాలలు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలలో బాలికలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు అంగ,రంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాలల ఆవరణలో బాలికలు వేసీన రంగురంగుల ముగ్గులతో సంక్రాంతి పండుగ రాక ముందే నూతన పండుగ శోభను సంతరించుకున్నది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లోని విఆర్ కే పురం పంచాయతీ చొక్కాల, విఆర్ కె .పురం ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గురువారం ముగ్గుల పోటీలను ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. వారం రోజులు సంక్రాంతి సెలవులు కావడంతో విద్యార్థులు ఒకరి నొకరం చూసుకోవడం వీలు పడదని పరస్పరం టాటా బై చెప్పు కున్నారు. సంక్రాంతి సెలవుల్లో కూడా ఇళ్ల వద్ద చదువు కోవాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాసంబంధమైన సూచనలు ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment