అయోధ్య శ్రీరామ అక్షింతల కలశాల శోభాయాత్ర. 

అయోధ్య శ్రీరామ అక్షింతల కలశాల శోభాయాత్ర. 

– ఇంటింటికి అక్షింతలు పంపిణీ. 

– గడప గడపకు శ్రీరామ జయ రామ జగధభిరామ నినాదం. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం,వాజేడు మండలాల్లో అయోధ్య శ్రీరామ జన్మ భూమి తీర్ధక్షేత్ర, విశ్వవ్యాప్త రామ భక్తులకు అయోధ్య రాముడి అక్షింతలను గ్రామగ్రామాన గడప గడపకు పంపిణీ చేసే కార్యక్రమం ముమ్మరంగ చేపట్టారు. జై శ్రీరామ జై జై శ్రీరామ అంటూ అశేష భక్త జనావళీ స్వామి వారి అక్షింతల కలశాలను శోభాయాత్రగా గ్రామాలలో ఉన్న శ్రీరామ ఆలయాలు, ఇతర ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి గడప గడపకు స్వామివారి అక్షింతలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం పట్టణ కేంద్రంలోని వీధి వీధికి మహిళా భక్త సోదరీ మణులు, భక్తులు శ్రీరామ భక్తులు కమిటీలుగా ఏర్పడి అక్షింతలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే మండలం లోని బెస్తగూడెం గ్రామంలో, శ్రీరామ భక్తులు శ్రీ రామాల యం ఆలయ కమిటీ, మహిళా భక్తులు అక్షింతల కలశాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయానికి తీసుకువెళ్లి, అక్కడి నుండి జయరామ శ్రీరామ జై జై రామ అంటూ స్వామివారి నినాదాలతో గ్రామం లో శ్రీరాముడి భజన కార్యక్రమాలతో, అంజన్న స్వాములు హనుమాన్ మాలధారణ స్వాముల వారితో  హనుమాన్ మందిరా ల్లో పూజలు నిర్వహించి ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భం గా గ్రామాల్లో జగదభి రామ, అయోధ్య రామ, జై శ్రీరామ అంటూ భక్తులు నినాదాలతో మారుమూల గ్రామాల్లో సైతం, అయోధ్య శ్రీరాముడి విశ్వవ్యాప్త రామ భక్తులకు అయోధ్య రాముడి అక్షింత లు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతున్నది. శ్రీరామ జన్మభూమి మందిరం అక్షింతలను అత్యంత భక్తిశ్రద్ధలతో పంపిణీ చేసే కమిటీల కు ఆయా గృహస్తులు భక్తి శ్రద్దలతో స్వీకరిస్తున్నారు. శ్రీరామ జయ రామ, జయ జయ రామ అనే మహా మంత్రమును అందరు కలిసి సామూహికంగా జపిస్తూ, హనుమాన్ చాలీసా, సుందరకాండ రామ, రక్షా స్తోత్రం వంటి పారాయణం చేస్తూ, సాత్వికంగా రామా మయంగా అక్షింతలను స్వీకరిస్తున్నారు. అంతా రామమయం, జగమంతా రామ మయం, జగదభి రామ శ్రీరామ అంటూ భక్తి రస పాటలతో గ్రామాల్లో అయోధ్య శ్రీ రాముడు అక్షింతల భక్తి రస కార్యక్రమం ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమం, మారుమూల ఏజెన్సీ లో గ్రామ గ్రామాన మారుమోగుతున్నది.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “అయోధ్య శ్రీరామ అక్షింతల కలశాల శోభాయాత్ర. ”

Leave a comment