ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ డిఎంఅండ్ హెచ్ఓ.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఎటునాగారం ఐటిడిఏ అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ కోరం క్రాంతి కుమార్ ఆకస్మింకంగా తనిఖీలు నిర్వహిం చారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందించే ఆరోగ్య సేవల గురించి వైద్యాధికారి డాక్టర్ శ్రేష్ట ను అడిగి తెలుసు కున్నారు. ప్రజలకు అందుతున్న వైద్య సౌకర్యాలను, పారిశుధ్యం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన గ్రామాల నుంచి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని వైద్యులు, సిబ్బంది ఆసుపత్రికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రతిరోజు ఆస్పత్రి సిబ్బంది విధిగా బయోమె ట్రిక్ అటెండెన్స్ మార్క్ చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా రోజు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆస్పత్రిలో ఓపి సంఖ్య పెంచేలా కృషి చేయాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా వ్యవ హరించి ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్ర మంలో ఆర్ . మహేందర్, ఐటీడీఎ ప్రోగ్రాం మేనేజర్, ఎండీ ఖలీల్, ఐటిడిఏ హెల్త్ సెల్ సూపర్వైజర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
1 thought on “ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ డిఎంఅండ్ హెచ్ఓ. ”