భరోసా కేంద్రంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి..

భరోసా కేంద్రంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి..

– జిల్లా ఎస్పి గౌస్ ఆలం 

ములుగు, డిసెంబర్29, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలోని భరోసా  కేంద్రంలో  సర్వీస్  రెగ్యుల  రైజేషన్  హక్కులు  లేకుండా కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేసేందుకు మహిళా అభ్యర్థినిల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎస్పీ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడాది కాలవ్యవధితో ఒక కౌన్సిలర్, ఒక సపోర్ట్ పర్సన్, ఒక లీగల్ సపోర్ట్ అధికారి, ఒక రిసెప్షనిస్ట్, ఒక మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ANM) ఉద్యోగ నియామకాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. కౌన్సిలర్ ఉద్యోగానికి ఎమ్మెస్సీ సైకాలజీ/ ఎంఏ సైకాలజీ/ ఎం.ఎస్.డబ్ల్యూ, సపోర్ట్ పర్సన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎం.ఎస్.డబ్ల్యూ/ చైల్డ్  డెవలప్మెంట్ / సైకాలజీ విభాగం లో మాస్టర్స్ పూర్తి చేయాలని, లీగల్ సపోర్ట్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎల్ఎల్బి/ఎల్ఎల్ యం, రిసెప్ష నిస్ట్ ఉద్యోగానికి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి కంప్యూటర్ లిటరేట్ అయి ఉండాలనీ, Tally ERP లేదా మరేదైనా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంద న్నారు. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్(ANM) ఉద్యోగానికి బి.ఎస్.సి. నర్సింగ్/ GNM (జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరి)/ANM (సహాయక నర్సు మరియు మిడ్‌వైఫ్) పూర్తి చేసి ఉండాలనీ తెలిపారు. గౌరవవేతనంగా కౌన్సిలర్ కు రూ.30వేలు, సపోర్ట్ పర్సన్ కు రూ.20వేలు, లీగల్ సపోర్ట్ ఆఫీసర్ కు రూ.22వేలు, రిసెప్షనిస్ట్ ఉద్యోగానికి రూ.15వేలు, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ANM) ఉద్యోగానికి రూ.16వేలు ఉంటుందన్నారు . నియామకం ప్రక్రియ మొత్తం మహిళ భద్రతా విభాగం ప్రతినిధుల ద్వారా జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థినులు తమ బయో డేటా, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, అనుభవం సర్టిఫికెట్స్ ను https://womensafetywing.telangana.gov.in/careers/ వెబ్ సైటు ద్వారా 15 రోజుల లోగా దరఖాస్తులు పంపించాలన్నా రు. పై దరఖాస్తు విషయంలో ఏమైనా సందేహాలు ఉన్నచో Careers.Wsw@gmai.com లో సంప్రదించాలని సూచించారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “భరోసా కేంద్రంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి..”

Leave a comment