జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన

భూపాలపల్లి తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఈ నెల29 శుక్రవారం జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పోన్నం ప్రభాకర్ , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించనున్నారు..10:30 గంటలకు హైదరాబాదు నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 11:30 కిమేడిగడ్డకు చేరుకుంటారు.11:30నుండి 1:00గంటల వరకు E-IN-C ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ & మేడిగడ్డ బ్యారేజీ పైర్ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం1:00నుండి 2:00గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి క్యాంపు కార్యాలయానికి తిరిగి వెళ్తారు.02:00నుండి 03:00గంటల వరకు మీడియా ప్రతినిధులతో కలిసి భోజనం చేస్తారు. 03:00నుండి 03:20వరకు మేడి గడ్డ నుండి అన్నారం బ్యారేజ్ చేరుకుంటారు. 3:20నుండి 4:20 వరకు అన్నారం బ్యారేజ్ పరిశీలిస్తారు. ý4:30 గంటలకు అన్నారం బ్యారేజ్ నుండి బయల్దేరి 5:30కి తిరిగి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన”

Leave a comment